క్రికెట్ అభిమానులకు షాక్ తగలనుందా.. ఇవాళ జరిగే ఐపీఎల్ మ్యాచ్ సజావుగా సాగదా.. సాయంత్రం స్టార్ట్ అయ్యే మ్యాచ్ ను మధ్యలో గంట సేపు ఆపేస్తారా.. మ్యాచ్ ఆపేస్తే స్టేడియంకు వచ్చిన వారు ఎలా ఉంటారు.. ఇలా చాలా ప్రశ్నలు అనేక మంది మదిలో మెదులుతున్నాయి. ఎందుకంటే.. ఇవాళ మార్చి23, 2024 కాబట్టి మార్చి 23 అంత స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా.. మార్చి 23న ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ ఉంది. అంటే గంట సేపు ప్రపంచంలోని 190 దేశాల్లో దీపాలు ఆర్పేసి భూమాతకు మద్దతుగా నిలవాలి. ఎర్త్ అవర్ అంటే ఎంటి దీనికి క్రికెట్ కు సంబంధం అంటే ఏంటీ అని అనుకుంటున్నారా.. అయితే పూర్తిగా చదవండి..
అసలు ఏంటీ ఎర్త్ అవర్ కథ..?
ప్రకృతి మనకు ప్రతి ఏటా 125 ట్రిలియన్ డాలర్ల విలువగల ఆహారం, నీరు, గాలి మరియు ఇతర సేవలు అందిస్తోంది. అభివృద్ధి పేరుతో గత 50 సంవత్సరాల నుంచి ప్రకృతికి కనివినీ ఎరుగని నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో కర్బన ఉద్గారాలను తగ్గించడం, భూతాపం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్) ఎర్త్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
క్రికెట్ మ్యాచ్ రాత్రి పూట సజావుగా సాగాలంటే లైట్లు కంపల్సరీగా ఉండాల్సిందే. స్టేడియం అంతా ఎంత వెలుతురు ఉంటే అంత మంచిగా బాల్ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎర్త్ అవర్ రోజు గంట సేపు లైట్స్ ఆఫ్ చేయాల్సి ఉంది. మరీ క్రికెట్ స్టేడియంలోని లైట్స్ ఆఫ్ చేస్తారా లేదా.. అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మ్యాచ్ మధ్యలో లైట్లు ఆర్పేసి భూమాతకు తమ మద్దతును ప్రకటిస్తారా లేదా మ్యాచ్ ను సజావుగా సాగించి తమకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటారా అనేది బిగ్ క్వశ్చన్ గా ఉంది. మ్యాచ్ సజావుగా సాగుతుందా లేదా అనేది తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే మరి.