జపాన్​లో భూకంపం... రిక్టర్​ స్కేలుపై 5.9 తీవ్రత నమోదు

టోక్యో: జపాన్​లోని ఇషికావా ఉత్తర మధ్య ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. నోటో ద్వీపకల్పం ఉత్తర భాగంలో 5.9 తీవ్రతతో భూప్రకంపనాలు ఏర్పడ్డ రెండు గంటల్లోనే మరికొన్ని చోట్ల 4.8 తీవ్రతతో మరికొన్ని భూకంపాలు సంభవించాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదు.

సునామీ వచ్చే ప్రమాదం లేదని జపాన్​ వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రతా తనిఖీల కోసం షింకన్‌‌‌‌సెన్ సూపర్-ఎక్స్‌‌‌‌ప్రెస్ రైళ్లు, ఇతర రైలు సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం కొద్దిసేపటికి తిరిగి ప్రారంభించారు. అలాగే, భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలోని 2 అణు విద్యుత్ ప్లాంట్లలో ఎలాంటి అసాధారణ పరిస్థితి కనిపించలేదని న్యూక్లియర్ రెగ్యులేషన్ అథారిటీ తెలిపింది.

నోటో ద్వీపకల్పంలోని షికా ప్లాంట్‌‌‌‌కు మాత్రం స్వల్ప నష్టం వాటిల్లిందని, ఇది రెండు రియాక్టర్‌‌‌‌ల కూలింగ్​ ఫంక్షన్​పై అది ప్రభావితం చూపలేదని అధికారులు పేర్కొన్నారు. విద్యుత్​ సరఫరాలోనూ ఎలాంటి అంతరాయం కలుగలేదని హొకురికు 
ఎలక్ట్రిక్​ పవర్​ కార్పొరేషన్​ వెల్లడించింది.