చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పాట పాడుతూ పిల్లలకు అన్నం పెడుతుంటారు.. ఇది పాట కాదని నిజం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపైకి ఒక చిన్న చంద్రుడు వచ్చి రెండు నెలల పాటు ఉంటాడట. ఆకాశం నుంచి ఒక గ్రహశకలం భూమిపైకి వస్తుందని.. అది గురుత్వాకర్షణ పరిధిలో సంచరిస్తుందని ..ఆగష్టు 7న 2024 పీటీ5 అనే ఈ గ్రహశకలాన్ని సైంటిస్టులు కనుగొన్నారు . ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు భూమి చుట్టూ తిరుగుతుందని తెలిపారు.
అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ రీసెర్చ్ నోట్స్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రాబోయే గ్రహశకలం కేవలం 10 మీటర్ల (33 అడుగులు) వ్యాసం ఉంటుంది. భూమి చుట్టూ 53 రోజుల పాటు పరిభ్రమించనుంది. అదే వ్యవధిలో 2024 పీటీ5 పూర్తి కక్ష్యను చిట్టి చంద్రుడు పూర్తిచేయదు. దానికి బదులుగా అది భూమి గురుత్వాకర్షణ పరిధి నుంచి విడిపోనుంది.
కార్లోస్ డి లా ఫ్యూంటె మార్కోస్, రౌల్ డి లా ఫ్యూంటె మార్కోస్ రచించిన (RNAAS) నివేదికలో భూమికి గ్రహశకలాలను పట్టుకుని ... తన కక్ష్యలోకి లాక్కుంటుందని చెప్పారు. ఈ గ్రహశకలాలు కొన్నిసార్లు మన గ్రహం చుట్టూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో తిరిగి .. కక్ష్యను పూర్తి చేసే ముందు భూమి దీర్ఘవృత్తాకార మార్గం నుంచి విడిపోతాయి.
అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ యొక్క రీసెర్చ్ నోట్స్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం .. భూమి పైకి వచ్చిన గ్రహశకలం కేవలం 10 మీటర్ల (33 అడుగులు) వ్యాసంఉంటుందన్నారు. ఇది 53 రోజులపాటు భూమి చుట్టూ తిరిగుతుందనని పేర్కొన్నారు. కాని 2024 PT5 పూర్తి కక్ష్యను చేయదు. దీనికి బదులుగా భూమిపైకి వచ్చిన చిట్టి చంద్రుడు భూమి గురుత్వాకర్షణ నుండి విడిపోనుంది ఈ చిట్టి చంద్రుడిని మాత్రం నేరుగా మన కళ్లతో కానీ టెలిస్కోప్‌తో కానీ చూడలేమట. దీనిని చూడాలంటే శాస్త్రవేత్తలకే సాధ్యం అని అంటున్నారు.
2006లో, భూమి గురుత్వాకర్షణ ద్వారా సంగ్రహించిన ఒక ఉల్క.. దాని చుట్టూ జూలై 2006 నుంచి జూలై 2007 వరకు ఒక ఏడాది పాటు పరిభ్రమించింది. అయితే, కొత్తగా కనుగొన్న 2024 పీటీ5 2022 ఎన్ఎక్స్1 మార్గాన్ని పోలి ఉంటుంది. 1981, 2022లో భూమి చుట్టూ తిరిగే తాత్కాలిక ఫ్లైబై అనే గ్రహశకలం కనిపించింది. ఒక కక్ష్యను పూర్తి చేసి 2051లో మరో సెమీ రౌండ్‌కు తిరిగి రావచ్చు.
2006లో, భూమి యొక్క గురుత్వాకర్షణ ద్వారా సంగ్రహించబడిన ఒక ఉల్క ... దాని చుట్టూ జూలై 2006 నుండి జూలై 2007 వరకు ఒక సంవత్సరం పాటు పరిభ్రమించింది. కొత్తగా కనుగొన్న 2024 PT5 2022 ఎన్ ఎక్స్ 1 మార్గాన్ని పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1981, 2022 లో భూమి చుట్టూ తిరిగే తాత్కాలిక ఫ్లైబై అనే శకలం కనిపించిదని .. అది ఇప్పటికే ఒక కక్ష్యను పూర్తి చేసి, 2051లో మరో సెమీ రౌండ్‌కు తిరిగి రావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.