ఇండోనేషియాలో మరోసారి భూకంపం

ఇండోనేషియాలో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 6.2 గా నమోదు అయ్యిందని జీఎఫ్ జెడ్ జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. ప్రపంచమంతా న్యూ యర్ వేడుకలకు సిద్దమవుతుంటే.. ఇండోనేషియా ప్రజలు భూప్రకంపనలతో ఆందోళన చెందుతున్నారు. ఆ దేశంలో శనివారం (డిసెంబర్ 30) కూడా భూకంపం వచ్చింది. 24 గంటల గడవ ముందే మరోసారి జావా సిటీలో ఆదివారం ( డిసెంబర్ 31) న భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.