ఎక్కడికక్కడ చీలిపోయిన భూమి.. కూలిపోయిన వంతెనలు: మయన్మార్‎లో భూకంప విలయం

ఎక్కడికక్కడ చీలిపోయిన భూమి.. కూలిపోయిన వంతెనలు: మయన్మార్‎లో భూకంప విలయం

నైపిడా: రిక్టర్ స్కేల్‎పై 7.7 తీవ్రతతో సంభంవించిన భారీ భూకంపం మయన్మార్‎ను వణికించింది. మయన్మార్‎లోని సాగింగ్, మండలే, క్యూక్సే, పైన్ ఊ ల్విన్, ష్వెబోతో సహా అనేక పట్టణాల్లో భూ ప్రకంపనలు గడగడలాడించాయి. భూకంపక ధాటికి కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ భూమి చీలిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో భారీ భవనాలు, వంతెనలు నేలమట్టం అయ్యాయి. భూప్రకంపనలకు మయన్మార్ లోని ఎత్తైన భవనాలు నిలువునా కూలిపోయాయి. అతి శక్తివంతంమైన భూకంపం సంభవించడంతో మయన్మార్ చిగురుటాకులా వణికిపోతుంది. 

మండలేలోని చారిత్రాత్మక మండలే ప్యాలెస్ తీవ్రంగా దెబ్బతిన్నది. అలాగే.. సాగింగ్ ప్రాంతంలోని సాగింగ్ టౌన్‌షిప్‌లోని ఒక వంతెన పూర్తిగా కుప్పకూలింది. మండలేలోని చారిత్రాత్మక మండలే ప్యాలెస్ యొక్క భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ప్రత్యక్ష సాక్షులు మంగళవారం మయన్మార్ నౌతో చెప్పారు. అదే సమయంలో, భూకంపంలో సాగింగ్ ప్రాంతంలోని సాగింగ్ టౌన్‌షిప్‌లోని ఒక వంతెన పూర్తిగా ధ్వంసమైంది. క్యూక్సే, పైన్ ఊ ల్విన్, ష్వెబో వంటి ఇతర సమీప పట్టణాలు కూడా భూకంప ధాటికి వణికిపోయాయి. మయన్మార్‎లో భూకంపం సృష్టించిన విలయానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

ఈ వీడియోల్లో ఎత్తైన భవనాలు, బ్రిడ్జిలు నిమిషాల వ్యవధిలోనే కుప్పకూలిపోవడం కనిపిస్తోంది. ఒక్కసారిగా భారీ భూకంపం సంభవించడంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలు భయాందోళనకు గురై రోడ్లపై పరుగులు పెడుతోన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ భూకంపం నేపథ్యంలో మయన్మార్ ప్రభుత్వం అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టింది. భారీగానే ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన లెక్కలపై మయన్మార్ ప్రభుత్వం అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. 

ALSO READ : మయన్మార్ అతి భారీ భూకంపం : 7.7 తీవ్రతతో ఊగిపోయిన దేశం : బ్యాంకాక్ లో కూలిన 20 అంతస్తుల భవనం

2025, మార్చి 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో ఈ భూకంపం వచ్చినట్లు మయన్మార్ ప్రభుత్వం ప్రకటించింది. మండలే పట్టణం కేంద్రంగా భూమికి 10 కిలో మీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉంది. భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ కేంద్రం ఉండటంతో తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మయన్మార్ ప్రభుత్వం అంచనా ప్రకారం.. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) నివేదిక ప్రకారం భూకంపం తీవ్రత రిక్కర్ స్కేల్ పై 7.7 గా నమోదైనట్లు ప్రకటించింది. భూకంపం చాలా తీవ్రమైనదని.. ప్రమాదకరమైనదిగా చెబుతోంది. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా జరిగే అవకాశం ఉంది.