ములుగు/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తెలుగు రాష్ట్రాలను బుధవారం(డిసెంబర్ 4, 2024) ఉదయం భూకంపం వణికించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 7 గంటల సమయంలో భూప్రకంపనలు అలజడి సృష్టించాయి. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, హైదరాబాద్, విజయవాడ, జగ్గయ్యపేట, రంగారెడ్డి, కృష్ణా జిల్లాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఈ పరిణామంతో జనం ఉలిక్కిపడి భయంతో వణికిపోతూ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. 2 నుంచి 5 సెకన్ల పాటు భూమి కంపించింది.
Also Read :- 20 ఏళ్లలో తొలిసారి.. ములుగు జిల్లా కేంద్రంగా భారీ భూకంపం
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) December 4, 2024
భూకంప తీవ్రత విషయానికొస్తే.. రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ఉదయం 7.27కి భూప్రకంపనలు మొదలైనట్లు కొన్ని ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలతో స్పష్టమైంది. ములుగు జిల్లా ఐలాపూర్ కేంద్రంగా భూకంపం సంభవించింది. తెలంగాణ వ్యాప్తంగా భూకంపం రిక్టర్ స్కేల్పై 5.3 నమోదు కాగా, మూడు సెకన్లు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర మొత్తానికి ములుగు జిల్లా కేంద్ర బిందువుగా ఉన్నటు వంటి భూకంప కేంద్రం నివేదికను పరిశీలించగా భూమి లోపల 40 కిలోమీటర్ల నుంచి ఈ రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు తెలిపారు.
— Samba Siva Reddy Peram (@sivareddy_peram) December 4, 2024