మేఘాలయలో భూకంపం.. రిక్టర్ స్కేల్‎పై 4.1గా నమోదు

మేఘాలయలో భూకంపం.. రిక్టర్ స్కేల్‎పై 4.1గా నమోదు

షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో భూ కంపం సంభవించింది. మంగళవారం (జనవరి 21) మేఘాలయలోని నైరుతి ఖాసీ కొండలపై వచ్చిన భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.1గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు ఎన్సీఎస్ తెలిపింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. ఏం జరుగుతుతుందో అర్థం కాక ఇండ్ల నుండి బయటకు పరుగులు తీశారు. 

ALSO READ | టర్కీలో ఘోరం: హోటల్ లో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది మృతి

భూ ప్రకంపనల నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్డీఆర్ఎఫ్ వంటి సహయ బృందాలను అలర్ట్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల నేపాల్ టిబెట్ బోర్డర్‎లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో వందల సంఖ్యల మరణాల సంఖ్య నమోదు అయ్యింది. వేలాది మంది గాయపడ్డారు. ఎంతో మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.