లడఖ్ లో భూకంపం..రిక్టర్ స్కేలుపై 4.2

లడఖ్ లో భూకంపం..రిక్టర్ స్కేలుపై 4.2

కేంద్రపాలిత ప్రాంతం  లడఖ్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై  4.2 తీవ్రతతో  భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది . ఏప్రిల్ 1న  సాయంత్రం 5:38 గంటలకు  లేహ్‌,లడఖ్ లో 10 కి.మీ లోతులో ఈ భూకంపం  వచ్చిందని  వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం,ఆస్తినష్టం జరగలేదని తెలుస్తోంది. లేహ్,లడఖ్ రెండూ భూకంప జోన్ ఫోర్ లో ఉన్నాయి. అంటే భూకంపాలలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలు.


మార్చి 28న, మయన్మార్,బ్యాంకాక్ లో భూకంపాలు ప్రళయం సృష్టించిన సంగతి తెలిసిందే..చిన్న ఇండ్ల నుంచి మల్టీ ఫ్లోర్ బిల్డింగ్స్ వరకూ.. వంతెన నుంచి బ్రిడ్జీల వరకు.. దేన్నీ వదలకుండా నేలమట్టం చేశాయి మయన్మార్ లో వచ్చిన భూకంపాలు. ఎటు చూసినా శిథిలాలు.. ఆర్థనాదాలు, అంబులెన్స్ ల సైరెన్ లతో శవాల దిబ్బగా మారిపోయింది. మృతుల సంఖ్య దాదాపు 2 వేలను దాటడం ఇటీవలి కాలంలో వచ్చిన అతి పెద్ద విలయంగా చెప్పుకోవచ్చు.