అరేబియా సముద్రంలో భారీ భూకంపం

అరేబియా సముద్రంలో భారీ భూకంపం

అరేబియా సముద్రంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. లక్షద్వీప్ లోని  మినీకాయ్ ద్వీపానికి 270 కిలోమీటర్లదూరంలోని అరేబియా సముద్రంలో భూకం పం రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రతతో  సంభవించింది.

కొల్లాంకు 650 కిలోమీటర్లదూరంలో భూకంప కేంద్రంగా అరేబియా సముద్రం 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపంతో ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది.

భూకంపం సంభవించిన అతి సమీపంలోని పెద్ద పట్టణం కుల్హుదుఫుషి  ఉంది.  భూకంప కేంద్రానికి తూర్పున 238 కిమీ దూరంలో మాల్దీవుల్లో 9వేల 500 మంది నివాసి తులు ఉన్నారు . భూకంపం సంభవించడంతో ప్రజలను భయాందోళనకు గురయ్యారు.భూకంప కేంద్రం నుంచి 422 కిమీ దూరంలో మాల్దీవుల రాజధాని మాలేలో మాత్రం ఎటువంటి ప్రభావం లేదు. 
 

మరోవైపు  కేరళలో మంగళవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావారణ శాఖ. ఈ జిల్లాల్లో 24 గంటల్లో 204.4 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టు తెలిపింది. రానున్న కొన్ని గంటల్లో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వివిధ జిల్లాలకు ఆరెంజ్ , ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.