కార్గిల్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదు

కార్గిల్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదు

జూలై 4న ఉదయం 7:38 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రతతో కార్గిల్ లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, కార్గిల్‌కు ఉత్తరాన 401 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు సంభవించాయి.

సాధారణంగా భూకంపాలు సంభవించే హిమాలయ ప్రాంతంలో ఇది 38.12 డిగ్రీల అక్షాంశం, 150 కిలోమీటర్ల లోతులో 76.82 డిగ్రీల రేఖాంశంలో ఉందని భూకంప కేంద్రం తెలిపింది. అయితే ఈ ఘటనలో ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు ఇప్పటివరకూ ఎలాంటి నివేదికలు లేవు. కాగా ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

https://twitter.com/NCS_Earthquake/status/1676053994328981504