బ్రేకింగ్: జపాన్‎లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‎పై 6.2 తీవ్రత నమోదు

బ్రేకింగ్: జపాన్‎లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‎పై 6.2 తీవ్రత నమోదు

టోక్యో: వరుస భూకంపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇటీవల మయన్మార్, థాయ్‎లాండ్ దేశాలను భారీ భూకంపం గడగడలాడించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి మయన్మార్ శ్మశాన వాటికను తలపిస్తోంది. దాదాపు 3 వేల మంది మరణించారు. ఇంకా వేల మంది శిథిలాల కింద చిక్కుకుని ఉండగా.. వారి కోసం సహకయ చర్యలు  కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగానే.. బుధవారం (ఏప్రిల్ 2) జపాన్‎లోని క్యుషులో భారీ భూకంపం సంభవించింది.

భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‎పై 6.2గా నమోదైనట్లు జపాన్ అధికారులు వెల్లడించారు. క్యుషులో భూకంపం కేంద్రం ఉన్నట్లు తెలిపారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం సహయక చర్యలు చేపట్టింది.

 కాగా, జపాన్‎లో భారీ భూకంపం సంభవించబోతుందని.. దీని ప్రభావంతో వేల సంఖ్యలో ప్రజలు చనిపోతారని జపాన్ ప్రభుత్వం ఇటీవల ఒక నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చెప్పిన వారం రోజుల వ్యవధిలోనే జపాన్లో భారీ భూకంపం సంభవించడం గమనార్హం.