జపాన్ లో మళ్లీ తీవ్ర భూకంపం సంభవించింది. అనేక భూకంపాలు సంభవించి విధ్వంసం సృష్టించిన వారం రోజుల తర్వాత జపాన్ మధ్య ప్రాంతంలో 6.0 తీవ్రతతో మరో శక్తివంతమైన ప్రకంపనలతో భూకంపం సంభవించింది. మంగళవారం జపాన్ సముద్ర తీరంలో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. పలు చోట్ల ఇండ్లు ధ్వంసం అయ్యాయి. ప్రాణనష్టంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
2024 కొత్త సంవత్సరం మొదటి రోజున జపాన్ సముద్ర తీరంలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దాదాపు 121 సార్లు భూమి కంపించడంతో భారీ విధ్వంసం జరిగింది. 200 మంది కి పైగా చనిపోయారు.