ఇండోనేషియాలో భూకంపం.. ఉత్తర సుమత్రాలో ప్రకంపనలు

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైంది. ఈవిషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఇవాళ సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు భూకంపం వచ్చిందని తెలిపింది. భూమికి 10  కిలోమీటర్ల  లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు పేర్కొంది. ఈ భూకంపంలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేసింది. 

ఇక మన దేశంలోని  హర్యానాలో ఉన్న ఝజ్జర్ ప్రాంతంలో జనవరి 1న వేకువజామున 1.19 గంటలకు భూకంపం వచ్చింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ లలోనూ భూప్రకంపనలు సంభవించాయి.