ఆప్ఘనిస్తాన్ ను మరోసారి భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, భూకంపం 01:12 IST సమయంలో సంభవించింది. దాని లోతు 120 కి.మీ. అని NCS ఎక్స్ ద్వారా తెలిపింది.
వారం వ్యవధిలోనే మూడో భూకంపం
ఆఫ్ఘనిస్తాన్‌లో వారం రోజుల వ్యవధిలో మూడోసారి భూకంపం వచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) రిపోర్ట్ ప్రకారం జనవరి 3న ఫైజాబాద్‌లో రెండు భూకంపాలు సంభవించాయి. మొదటిది భూకంపం 00:28 IST వద్ద సంభవించింది, ఇది ఫైజాబాద్ కు తూర్పున 126కిలో మీటర్ల దూరంలో ఉంది. తదనంతరం, రెండవ భూకంపం 00:55 IST వద్ద సంభవించింది. ఇది ఫైజాబాద్‌కు తూర్పు-ఆగ్నేయంగా 100 కి.మీ దూరంలో నమోదైందని ఎన్సీఎస్ తెలిపింది.
Earthquake of Magnitude:4.3, Occurred on 04-01-2024, 01:12:11 IST, Lat: 38.24 & Long: 74.31, Depth: 120 Km ,Location: Afghanistan for more information Download the BhooKamp App https://t.co/WvUZG90k9E @KirenRijiju @moesgoi @Dr_Mishra1966 @ndmaindia @Indiametdept pic.twitter.com/RQ06M4MLhh
— National Center for Seismology (@NCS_Earthquake) January 3, 2024