నేపాల్లో భూకంపం..ఢిల్లీ, యూపీలో కూడా ప్రకంపనలు

నేపాల్లో భూకంపం..ఢిల్లీ, యూపీలో కూడా ప్రకంపనలు

నేపాల్ లో  భూకంపం వచ్చింది.  రిక్టర్ స్కేలుపై  5.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఏప్రిల్ 4న రాత్రి 7.52 గంటలకు పశ్చిమ నేపాల్‌లో 20 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది.  నేపాల్ తో పాటు  ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కూడా పలు ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయని  తెలిపింది.  అయితే ఆస్తి నష్టం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కాని జరిగినట్లు ఇంకా  వెల్లడించలేదు.

మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో 2.6 తీవ్రతతో భూకంపం నమోదైన ఒక రోజు తర్వాత నేపాల్‌లో భూకంపం సంభవించింది . మార్చి 28న మయన్మార్, బ్యాంకాక్ లో వచ్చిన భూకంపం మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. భూకంపం ధాటికి  మరణించిన వారి సంఖ్య 4 వేలు దాటగా.. 5 వేల మందికి పైగా గాయపడ్డారు. 341 మంది  ఆచూకీ ఇంకా తెల్వలేదు.