ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. జావా ద్వీపం సమీపంలో మార్చి 22న భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 6.5 తీవ్రతగా నమోదయ్యింది. రాజధాని జకార్తాలో భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో ఒక్కసారిగి ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. భూకంప తీవ్రతకు భవనాలు కూలిపోయాయి ,రోడ్లు బీటలు వారాయి.
భూకంపం సుమారు ఎనిమిది కిలోమీటర్ల లోతున వచ్చింది జావా ద్వీపం యొక్క ఉత్తర తీరంలో బవెన్ ద్వీపానికి సమీపంలో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:52 గంటలకు కు భూకంపం సంభవించింది.
ఇండోనేషియాలో తరచూ భూకంపాలు వస్తాయి. 2021 జనవరిలో సులవేసి ద్వీపాన్ని కుదిపేసింది. ఈ భూకంపంతో 100 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 2018లో సులవేసిలోని పాలూలో 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపంతో .. సునామీ కారణంగా 2,200 మందికి పైగా మరణించారు. 2004లో అచే ప్రావిన్స్‌లో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం, సునామీకి ఇండోనేషియాలో 170 వేల మందికి పైగా మరణించారు.