
న్యూజిలాండ్ లో భారీ భూకంపం వచ్చింది. రివర్టన్ తీరంలో మంగళవారం(మార్చి 25) ఉదయం రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం దాటికి ఇండ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు.
సౌత్ ఐలాండ్ యొక్క నైరుతి నుంచి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు USGS తెలిపింది. ప్రకంపన తీవ్రత ఉన్నప్పటికీ అధికారులు ఈ ప్రాంతానికి ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ప్రాన నష్టం గురించి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో వైపు భూకంప ప్రకంపనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది