ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం : కుప్పకూలిన ఇళ్లు

ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ భూకంపం : కుప్పకూలిన ఇళ్లు

కాబూల్‌: వరుస భూకంపాలతో ఆఫ్టనిస్తాన్ వణికిపోతోంది. ఇటీవల సంభవించిన వరుస భూకంపాలతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్ సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరోసారి భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతో భూమి కంపించింది. హెరాత్ నగరానికి 29 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంపం ధాటికి అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. 

శనివారం(అక్టోబర్7)  పశ్చిమఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. హెరాత్‌లోని జిందా జన్ జిల్లా"లో 7.7 కి.మీ లోతులో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాదాపు 2వేల మందికి పైగా మరణించినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. అనేక గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ లో హెరాత్ లో  మొత్తం ఆరుసార్లు భూమి కంపించింది. ఫరా , బద్గీస్ ప్రావిన్సులలో కూడా భూకంపం సంభవించింది. అత్యధికంగా 6.3 తీవ్రతతో భూకంపం విధ్వంసం సృష్టించిందని  అధికారులు తెలిపారు. 

Also Read :- దసరా నవరాత్రులు..టార్గెట్​గా ప్రచారం?