నేపాల్, బీహార్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

నేపాల్, బీహార్లో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన జనం

నేపాల్‌లో భూమి కంపించింది.బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం (ఫిబ్రవరి 28)తెల్లవారుజామున నేపాల్‌లో రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత నమోదు అయింది. నేపాల్‌తో పాటు బీహార్‌లోని అనేక జిల్లాల్లోనూ భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇండ్లనుంచి పరుగులు పెట్టారు. 

నేపాల్‌లోని సింధుపల్‌చోక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూకంప కేంద్రంగా భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంపం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని తెలిపారు.