న్యూఢిల్లీ: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైంది. నేపాల్లోని హిమాలయ పర్వత ప్రాంతంలోని లబుచేకుకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఉదయం 6:35 గంటలకు భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. ఇండియాలోని పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. మంగళవారం ఉదయం ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతంతో పాటు ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.
ALSO READ : SPADEX డాకింగ్ ఆపరేషన్ వాయిదా.. ప్రకటించిన ఇస్రో
పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో మంగళవారం ఉదయం 6:37 నిమిషాలకు 15 సెకన్ల పాటు భూమి కంపించింది. జల్ పైగురి, కూచ్ బెహర్ ప్రాంతాల్లో ఉదయం 6:35కు భూకంపం సంభవించింది. భూమి కొద్దిపాటి కుదుపులకు లోనైంది తప్ప అదృష్టవశాత్తు ఎలాంటి నష్టం జరగలేదు. బీహార్లోని పాట్నాలో కూడా మంగళవారం ఉదయం భూమి రెండుసార్లు స్వల్పంగా కంపించింది. బెంగాల్ రాజధాని కోల్కత్తాలో కూడా భూమి కంపించింది.