![మెక్సికోను కుదిపేసిన భూకంపం.. ఇళ్లు, ఆఫీసుల్లోనుంచి.. భయంతో పరుగులు](https://static.v6velugu.com/uploads/2023/12/earthquake-with-magnitude-58-shakes-buildings-in-mexico-city_nYTpjqeZAu.jpg)
సెంట్రల్ మెక్సికోలోని కొన్ని ప్రాంతాలను తెల్లవారుజామున 1.33 గంటలకు భూకంపం కుదిపేసింది. దీంతో మెక్సికన్ రాజధానిలోని భవనాలు కంపించాయి. ఈ క్రమంలో భూకంపం సంభవించిన ప్రదేశం నుంచి ఆందోళన చెందుతున్న నివాసితులు.. వెంటనే వీధుల్లోకి చేరారు. అయితే ఈ సంఘటనకు సంబంధించిన నష్టాల గురించి ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు.
దేశంలోని నేషనల్ సీస్మోలాజికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, సెంట్రల్ మెక్సికోలో డిసెంబర్ 7న 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రకంపనల కారణంగా మెక్సికో సిటీలోని భవనాలు కంపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో రాజధాని అంతటా భూకంప హెచ్చరికలు వినిపించాయి. ప్రజలు వ్యాపారాలు, ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.
??Big earthquake in Mexico City just now. All the office workers in the buildings on Reforma Avenue paraded out into the street. I didn’t see any damage. Now everybody seems to be going back to their buildings, going home. Sismo en CDMX pic.twitter.com/3BoxdTY87r
— N. Parish Flannery (@NathanielParish) December 7, 2023