ఉత్తరాఖండ్లో భూకంపం వచ్చింది.. శుక్రవారం (జనవరి 24, 2025) ఉదయం రిక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతతో నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ డిపార్టుమెంట్ తెలిపింది. ఉత్తరకాశీ ప్రాంతంలో 5 కి.మీ లోతులో 30.85 నార్త్ 78.60 తూర్పు రేఖాంశం వద్ద ఈ భూకంపం సంభవించింది.
గతంలో కూడా ఉత్తరాఖండ్ లో భూకంపాలు బీభత్సం సృష్టించాయి. 1991 ఉత్తరకాశీలో వచ్చిన భూకంపం కారణంగా భారీ నష్టాన్ని చవిచూసింది. రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం..భారీ ఆస్తి, ప్రాణనష్టానికి కారణమైంది.1999లో ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా భారీ భూకంపానికి అతలాకుతలం అయింది. ఆ సమయంలో కూడా ఈ ప్రకృతి వైపరీత్యం భారీ విధ్వంసం సృష్టించింది. 2017లో కూడా రుద్రప్రయాగ్ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రతతో వచ్చింది.. అయితే ఆస్తి, ప్రాణనష్టం జరగలేదు.
ఉత్తరాఖండ్ ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతం. ప్రతి యేటా క్లౌడ్ బరస్ట్ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి ప్రకోపాలకు సంభవించి విధ్వంసం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో భూకంపం కూడా సంభవించే అక్కడి ప్రజలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. శుక్రవారం తెల్లవారుజామున వచ్చిన భూకంపం స్పల్పంగా రావడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.