ఏపీలోని ప్రకాశం జిల్లా భూ ప్రకంపనలు : ఇళ్ల నుంచి జనం పరుగులు

ఏపీలోని ప్రకాశం జిల్లా భూ ప్రకంపనలు : ఇళ్ల నుంచి జనం పరుగులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ కంపం వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రెండు మండలాల్లో భూమి కంపించింది. 2024, డిసెంబర్ 21వ తేదీ శనివారం ఉదయం 11 గంటల సమయంలో భూమి కంపించింది.ఉమ్మడి ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రెండు అంటే రెండు సెకన్లు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంప తీవ్రతకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. ముండ్లమూరు ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం, ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించటంతో ఇళ్లు, ప్రభుత్వ ఆఫీసుల నుంచి జనాలు బయటకు పరిగెత్తారు.
 

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు రావటం ఇది కొత్త కాదు.. కొంతకాలం కిందట కూడా ఒకటి, రెండుసార్లు భూప్రకంపనలు వచ్చాయి. 
అయితే..  గతంలో కూడా ఇదే ముండ్లమూరు, తాళ్లూరు మండలంలోని గ్రామాల్లోనే భూప్రకంపనలు రావటం గమర్హం.

Also Read :- శబరిమలకు పోటెత్తిన భక్తులు .. పంబ నుంచి క్యూ..

ఇదిలా ఉండగా..  ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూ ప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని పలు జిల్లాలతో సహా హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి.. తెలంగాణలోని ములుగు జిల్లా, ఏపీలోని గోదావరి జిల్లాలు, విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. అయితే.. ఈ ప్రకంపనల తీవ్రత నామమాత్రంగానే ఉండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.