మేఘాలయ, అస్సాంలో భూ ప్రకంపనలు

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవాళ (అక్టోబర్ 2న) సాయంత్రం 6 :15 గంటలకు  మేఘాలయలోని నార్త్ గారో హిల్స్ లో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో ముందుగా భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆ తర్వాత అస్సాం, పశ్చిమబెంగాల్ లో కూడా ప్రకంపనలు వచ్చాయి. అయితే.. ప్రకంపనల కారణంగా ఎవరికీ ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.