న్యూఢిల్లీ: ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఈజ్‌మైట్రిప్.కామ్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈజీ గ్రీన్ మొబిలిటీ సబ్సిడరీ ద్వారా ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయనుంది. మరో సబ్సిడరీ యోలోబస్ వీటిని ఆపరేట్ చేయనుంది.
ఆర్ అండ్ డీ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశామని ఈజ్‌మైట్రిప్ ప్రకటించింది. రానున్న రెండు మూడేళ్లలో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఏడాదికి 1,25,000–1,50,000 ఎలక్ట్రిక్ బస్సుల అవసరం ఉందని వెల్లడించింది.