అక్కడ ఖచ్చితంగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాల్సిందే... లేదంటే జైలు జీవితమే..

భారతీయ వివాహ చట్టంలో కూడా ఒక వ్యక్తికి ఒకే భార్య అనే నిబంధన ఉంది. రెండో పెళ్లి చేసుకుంటే జైలుకెళ్లక తప్పదు. కానీ ఈ దేశంలో మాత్రం రెండో పెళ్లి చేసుకోకపోతే క్రిమినల్‌ కేసు పెట్టి, జైలు శిక్ష విధిస్తారట. అదేంటీ ఇలాంటి దేశాలు కూడా ఉంటాయా? అని ఆలోచిస్తున్నారా? కానీ అక్కడ మాత్రం రెండో పెళ్లి చేసుకోకపోతే నేరస్తులుగా పరిగణిస్తారు. రెండో పెళ్లి చేసుకోని వ్యక్తి నేరస్తుడే. దీంతో ప్రతి వాడికి ఇద్దరు పెళ్లాలుండాల్సిందే. ఇద్దరితో సక్రమంగా సంసారం చేయాల్సిందే. కాదంటే శిక్షకు అర్హులు అవుతారు. అదేంటని ఆశ్యర్యపోతున్నారా? అయితే మీరు ఈ దేశం గురించి తెలుసుకోవల్సిందే..

మన దేశంలో రెండో పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా నేరం. మొదటి భార్య బతికుండగా రెండో వివాహం చేసుకోవడాన్ని చట్టం, కుటుంబ సభ్యులు అంగీకరించరు. మొదటి భార్య అనుమతితో అయితే రెండో పెళ్లి చేసుకోవచ్చు. భారతీయ సంప్రదాయంలో పెళ్లి అంటే నూరేళ్ల పంట. పంచభూతాలు మేళతాలాల మధ్య అతిథుల సమక్షంలో నిండు నూరేళ్లూ ఒకరికొకరు తోడునీడగా కలిసి ఉంటామని వధూవరులు పెళ్లి బంధంలోకి అడుగుపెడతారు.అలానే ఏకపత్నీ వ్రతం ఆజన్మాతం ఆచరిస్తూ సంసార బాధ్యతలు ఆచరించాలనేది మన హిందూ సంప్రదాయం చెబుతుంది. భారతీయ వివాహ చట్టం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే భార్య అనే నిబంధన ఉంది. రెండో పెళ్లి చేసుకుంటే జైలుకు వెళ్లడం ఖాయం.

పురుషులు రెండో పెళ్లి చేసుకోవాలనే నిబంధన ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఉందట. ఈ దేశాల్లో ఒకే పెళ్లి చేసుకుంటే చట్టరిత్యా నేరమట. ఈ దేశాల్లో పురషులంతా కచ్చితంగా ఇద్దరి స్త్రీలను పెళ్లి చేసుకోవాలి. మరో వింత ఏమిటంటే రెండో భార్యతో మొదటి భార్యకు సమస్య వస్తే.. ఆ ఇద్దరిని చట్టం జైలుకు పంపుతుందట. ఇంతకీ ఆచారం ఎక్కడ ఉందంటే తూర్పు ఆఫ్రికాలోని ఎరిత్రియాలో దేశంలో ఉంది. మన దేశంలో రెండో పెళ్లి చేసుకున్నా, రెండో భార్యను కలిగి ఉన్నా అది చట్టరిత్యానేరం అవుతుంది. కానీ ఎరిత్రియాలో మాత్రం రెండో పెళ్లి చేసుకోకపోతే అది చట్టరిత్యా నేరం. ఈ దేశంలో ఒక్కో పురుషుడు ఇద్దరేసి స్త్రీలను విహహం చేసుకోవాల్సిందేనని ప్రభుత్వం చట్టం చేసింది. 

ఎరిత్రియాలో ఇటువంటి చట్టం అమలు చేయడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయట. ఈ దేశంలో ఎప్పుడూ అంతర్యుద్ధాలు జరుగుతుంటాయి.కాబట్టి ఇలాంటి యుద్ధ సమయంలో మహిళంగా ఉండలేరు. ఒకవేళ ఒంటరిగా ఉన్నా ప్రమాదం జరగొచ్చు. అందుకనే అక్కడ స్త్రీలను రక్షించాలనే ఉద్ధేశ్యంతో రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని చట్టం చేశారు.మరో విషయం ఏమిటంటే ఇక్కడ స్త్రీల కంటే పురుషుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అందుకే మహిళలు ఒంటరిగా తమ జీవితాన్ని గడపలేరు. అందుకనే ప్రతి పురుషుడు ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఈ చట్టాన్ని తిరస్కరించినట్లయితే జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు. అలానే స్త్రీ అయిన తన భర్త రెండో పెళ్లి చేసుకోకుండా అడ్డుకుంటే ఆమెను కోర్టు శిక్షిస్తుంది. జీవిత ఖైదు కూడా విధిస్తుంది.