
ఇప్పుడు చాలా మందికి కారు ఉంటుంది. కాని పార్కింగ్ ప్లేస్ లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అందుకే ఎక్కడొక కారు పార్క్ చేస్తారు. అలాంటప్పుడు ఈశాన్యంలో ఖాళీగా ఉన్న స్థలంలో కార్ పార్కింగ్ చేయవచ్చా.. చేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయా.. . వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్‌గారి సూచనలను ఒకసారి తెలుసుకుందాం. . .
ప్రశ్న: సాధారణంగా ఈశాన్యంలో బరువు ఉండకూడదు. అంటారు. ఇంటికి ఈశాన్యం వైపు ఉన్న స్థలాన్ని చాలా రోజుల నుంచి ఖాళీగానే వదిలేశాం. ఈ మధ్య కారు కొన్నాం.. . ఈశాన్యంలో ఉన్న స్థలం తప్ప ఖాళీ స్థలం లేదు. అందుకని ఆ స్థలంలో కారు పార్కింగ్ చేయడానికి ఒక షెడ్డు కట్టాలనుకుంటున్నాం. షెడ్డు కట్టడం వల్ల సమస్యలొస్తాయా?
జవాబు: ఈశాన్యంలో బరువు ఉండకూడదు అనేది వాస్తవం. కానీ.. కారు పార్క్ చేయడం వల్ల పెద్దగా సమస్య ఉండదు. ఎందుకంటే.. కారు పార్క్ చేసినప్పుడు మాత్రమే అక్కడుంటుంది. రెగ్యులర్ తీస్తుంటారు. మళ్లీ పెడుతుంటారు. అయితే.. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సి విషయం ఏంటంటే.. ఈశాన్యం కేవలం ఓపెన్ పార్కింగు మీరన్నట్టుగా అక్కడ షెడ్డు కడితే మాత్రం సమస్యలు తప్పవు. ఎందుకంటే... షెడ్డు కట్టడం అంటే.. ఈశాన్యంలో బరువు పెట్టినట్టేకదా అని వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ అంటున్నారు.