యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఈస్ట్ కోస్ట్ ట్రైన్ లో పొగలు వచ్చాయి. ఎయిర్ పైప్ పగిలిపోవడంతో పొగలు అలుముకున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులంతా ఒక్కసారిగా ట్రైన్ దిగి భయంతో బయటకు పరుగులు తీశారు.
హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ట్రైన్ లో వంగపల్లి దగ్గరకు రాగానే పొగలు వచ్చాయని అధికారులు గుర్తించారు. వెంటనే సిబ్బంది ఎయిర్ పైప్ కు మరమ్మత్తులు చేసి ట్రైన్ ను పంపించారు.