ఇట్స్ గ్రేట్ : చెట్ల అంబులెన్స్ వచ్చేసింది.. దీని విశేషాలు ఏంటో చూద్దాం..

ఇట్స్ గ్రేట్ : చెట్ల అంబులెన్స్ వచ్చేసింది.. దీని విశేషాలు ఏంటో చూద్దాం..

ఓ మనిషి ప్రాణాపాయంలో ఉంటే లేదా అత్యవసరమైన చికిత్స అవసరమైతే వెంటనే అంబులెన్స్(108) కోసం ఫోన్ చేస్తాం. నిమిషాల వ్యవధిలోనే అంబులెన్స్ సదరు వ్యక్తి దగ్గరకు చేరుకుంటుంది. అందులోని మెడికల్ స్టాఫ్ వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందిస్తూ.. హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. ఇలానే ఓ చెట్టు కూడా ప్రమాదంలో ఉందని లేదా ఓ చెట్టుకు అర్జెంటుగా చికిత్స చేయాలని, అదీకాదంటే తరతరాల చెట్టు కాలగర్భంలో కలిసిపోతోందని అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే..? వింతగా ఉంది కదూ.. కానీ ఇది అక్షరాల నిజం. మనుషులవే కాదు.. మొక్కలవి కూడా ప్రాణాలే. మనకే కాదు.. వాటికి కూడా వ్యాధులొస్తాయి. మరి మనకు ప్రాణ వాయువునందించే మొక్కలు ప్రమాదంలో ఉంటే.. వాటి ప్రాణం నిలబెట్టకపోతే ఎలా? అందుకే ఢిల్లీ మున్సిపల్​ అధికారులు జబ్బుపడ్డ మొక్కల కోసం త్వరలోనే అంబులెన్స్ సేవలను ప్రారంభించబోతున్నారు.

ఇప్పటిదాకా మనం మనుషుల కోసం అత్యవసర అంబులెన్సు సర్వీసులను ఉపయోగించడం చూసాం.కానీ ఇప్పుడు , వృక్షాల కోసం కూడా ఇప్పుడు అంబులెన్సు సర్వీసులను ప్రారంభించారు.మనుషులకు ఎలాగయితే ప్రాణం ఉంటుందో చెట్లకు కూడా అలాగే ప్రాణం ఉంటుందని మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాము. అయితే మనుషుల ప్రాణాలకు విలువ నిచ్చే ఈరోజుల్లో చెట్ల ప్రాణాలకు ఎవరు విలువనిస్తున్నారు చెప్పండి. కానీ చెట్లు లేనిదే మనుషులకు మనుగడ లేదు. చెట్లు పచ్చగా కళకళ లాడుతూ ఉంటూనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము అనే విషయాన్నీ ఎవరు మర్చిపోవద్దు.చెట్లను కాపాడే ఉద్దేశ్యంతో ఢిల్లీ మున్సిపల్​ అధికారులు  ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.నీరు లేక ఎండిపోతున్న చెట్లను, వ్యాధుల బారిన పడ్డ వృక్షాలను గుర్తించి వాటికి చికిత్స అందించి వాటి ప్రాణాలను కాపాడడం కోసం అంబులెన్స్​సర్వీసులను ప్రారభించారుఉచిత అంబులెన్సు సేవలను అందుబాటులోకి  తెచ్చారు.

ఎండిపోతున్న చెట్లను గుర్తించి వాటిని కాపాడేందుకు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.ఈ ప్రత్యేకమైన అంబులెన్సు సర్వీసులు చెట్ల దగ్గరికి వెళ్లి వాటిని పరీక్షిస్తాయని, చెట్లకు ఏవైనా వ్యాధులు వస్తే సరైన చికిత్స అందించి వాటిని బతికిస్తారు. అలాగే అంబులెన్సులో పనిచేసే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ద్వారా చెట్లకు ఎలా చికిత్స చేయాలో నేర్పించారు.ముందుగా వ్యాధి బారిన పడ్డ చెట్లను నీటితో శుభ్రం చేసి చెట్టు మీద ఉన్న మృత కణాలను తొలగిస్తారు.ఆ తర్వాత వ్యాధికి తగ్గ ఔషధాలు, ఎరువులు అందించి చెట్లను స్టెరిలైజ్ చేస్తారు.  ఫంగస్ , తెగుళ్ల బారిన పడిన చెట్లను ట్రీ అంబులెన్స్ ద్వారా చికిత్స చేస్తున్నారు. ఇందులో  జెట్టింగ్​ పంప్​లు.... హైప్రెజర్​ పంప్​ లు కూడా అమర్చారు. క్రిములు..కీటకాల నుంచి చెట్లను రక్షించేందుకు ఈ అంబులెన్స్‌లో ఏర్పాట్లు చేశారు. 

ఢిల్లీలోని లుటియన్స్​ ప్రాంతంలో ట్రీ అంబులున్స్​ ద్వారా సేవలు అందిస్తున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు లక్షా 80 వేల చెట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా పెద్ద చెట్లు ఉండటం వలన బోలుగా మారాయి.  అటువంటి చెట్లను వ్యాధులు ..  తెగుళ్ళ నుండి రక్షించడానికి, బోలు ట్రంక్లలో కాంక్రీటు మరియు ఇనుప రాడ్లను నింపి చికిత్స చేస్తున్నారు. దెబ్బతిన్న చెట్లకు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు, చెట్టు యొక్క దెబ్బతిన్న భాగాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. అలాగే చెట్లు దెబ్బతిన్న చోట థర్మాకోల్​తో నింపిన ఇనుప కంచెను అమర్చడం జరుగుతుంది. వర్షం నుండి రక్షించడానికి POP (ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) ఉపయోగిస్తున్నారు.