సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా.. బీఆర్ఎస్ కార్పొరేటర్లు రహస్య భేటీ

సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా..  బీఆర్ఎస్  కార్పొరేటర్లు  రహస్య భేటీ

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్  కార్పొరేటర్లు  రహస్య భేటీ జరిపినట్లుగా తెలుస్తోంది.  సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్కు వ్యతిరేకంగా  నిర్వహించిన  ఈ రహస్య భేటీలో అధికార పార్టీకి చెందిన  14 మంది  కార్పొరేటర్లు పాల్గొన్నట్లుగా సమాచారం.  సిట్టింగ్ ఎమ్మెల్యేకు పార్టీ  తిరిగి టికెట్ కేటాయించడం పట్ల కొంతకాలంగా కార్పొరేటర్లు సీరియస్ గా ఉన్నారు.  ఎమ్మెల్యే పని తీరుతో నియోజకవర్గంలో పార్టీకి చెడ్డపేరు వస్తోందంటూ ఫైర్  అవుతున్నారు.   

నియోజకవర్గంలో తానే సుప్రీం అన్నట్లుగా  ఎమ్మెల్యే తీరు ఉందంటూ సొంతపార్టీ   కార్పొరేటర్లు మండిపడుతున్నారు.  ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడితే  తాము  కార్పొరేటర్లని చూడకుండా  పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేగా  డివిజన్ల అభివృద్ధికి నరేందర్  ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శస్తున్నారు.  

అయితే  ఈ రహస్య భేటీలో  బీఆర్ఎస్ వరంగల్ తూర్పు టికెట్ అభ్యర్థిగా నరేందర్ ను మార్చాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు సమాచారం. ఈ తీర్మానాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్  కు పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.  పార్టీ అధిష్టానం వరంగల్ తూర్పు టికెట్ కేటాయింపులో మరోసారి ఆలోచన చేయాలని చెప్పనున్నట్లుగా సమాచారం.  పార్టీ లైన్ దాటం.. సొంత పార్టీ క్యాండిడెట్ నే గెలిపించుకుంటామని అంటూనే..  నరేందర్ ను  వద్దని అధిష్టానంపై ఒత్తిడి తేవాలని కార్పొరేటర్లు   భావిస్తు