ఖిలావరంగల్/ గ్రేటర్వరంగల్, వెలుగు : నూతన చట్టాలపై ప్రతీ పోలీసు అధికారి అవగాహన కలిగి ఉండాలని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారీ పోలీస్ అధికారులు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గురువారం బోల్లి కుంటలోని వాగ్దేవి కళాశాల ప్రాంగణంలో, సిటీలోని ఎల్బీ కాలేజీలో వారు వేర్వేరుగా పోలీస్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను ప్రారంభించి, మాట్లాడారు.
జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లా పోలీసులందరికీ విడతలవారీగా శిక్షణా తరగతులను నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీలు తిరుపతి, కిషోర్, ఏసీపీలు నందిరామ్ నాయక్, దేవేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
వచ్చే నెల నుంచి కొత్త చట్టాలు..
జనగామ అర్బన్: నూతన చట్టాలు జూలై 1 నుంచి అమలు కానున్నాయని వెస్ట్ జోన్ డీసీపీ సీతారాం తెలిపారు. వరంగల్ సీపీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన కల్పించడంలో భాగంగా యశ్వంతాపూర్ క్రీస్తు జ్యోతి కాలేజీలో గురువారం ఏర్పాటు
చేసిన శిక్షణా తరగతులను డీసీపీ హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో జనగామ సీఐ రఘుపతి రెడ్డి, ఎస్సై సృజన్ కుమార్, నర్మెట ఎస్సై కె. శ్రీకాంత్, కానిస్టేబుళ్లు అనిల్‌కుమార్, బాబు, సిబ్బంది పాల్గొన్నారు.