తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ పై.. ఈసీ ఏమంటోంది..?

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు బ్రేక్ పై.. ఈసీ ఏమంటోంది..?

కొత్త రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పులకు అవకాశం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేక్ వేసింది ఎన్నికల కమిషన్. మీ సేవలో దరఖాస్తు చేసుకునే అవకాశానికి బ్రేక్ వేసింది ఈసీ. 

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించిన విషయం తెలిసిందే.. కొత్త రేషన్ కార్డులు, పాత కార్డుల్లో మార్పులు చేర్పులకు మీ సేవా ద్వారా అప్లికేషన్లు పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది నిరంతర ప్రక్రియ అని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

ALSO READ | కొత్త రేషన్ ​కార్డులకు మీసేవలోనూ దరఖాస్తులు.. పేరు, అడ్రస్, ఇతర మార్పుల అప్డేట్కు చాన్స్

గతంలో ప్రజాపాలన సదస్సులు ఇటీవల జరిగిన గ్రామ, వార్డు సభల్లో భారీగా దరఖాస్తులు అందాయి. హైదరాబాద్ ప్రజాభవన్​తో పాటు జిల్లాల్లో ప్రజావాణి కార్యక్రమం లోనూ దరఖాస్తులు వస్తున్నాయి. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించాలని డుప్లికేట్ లేకుండా అర్హులకు అందేందుకు వీలుంటుందని పౌరసరఫ రాల శాఖ పేర్కొంది. 

రేషన్ కార్డులకు బ్రేక్ పై ఈసీ వివరణ 

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో ప్రచారంపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. అలాంటిది ఏమీ లేదని.. కొత్త రేషన్ కార్డుల జారీపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని.. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చింది ఈసీ.