Kitchen Tip : పెనం మాడిందా.. పరేషాన్ వద్దు

స్టవ్ మీద గిన్నె పెట్టి.. ఇంకో పనిలో పడిపోతే.. వంటిల్లో వంట పరిస్థితి ఏంటి? ఒక్కోసారి వంటంతా పాడైపోతుంది. ఒక్కోసారి పెనం మాడిపోతుంది. అలా మాడిన పెనంను క్లీన్ చేయడం పెద్ద పని. ఆ పని ఈజీగా అయిపోవాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

  • మాడిన పెనంలో నీళ్లు పోసి మరిగించాలి. 
  • ఇలా చేస్తే మాడిన పెనం భాగం మెత్తగ అవుతుంది. 
  • అప్పుడు రుద్దితే మాడింది వదిలిపోతుంది. 
  • ఉప్పుతో ఏ వస్తువు అయినా క్లీన్ చేయొచ్చు. 
  • మాడిన పెనాన్ని క్లీన్ చేసేటప్పుడు గిన్నెలు తోమే సబ్బుతో ఉప్పు కలిపి రుద్దాలి. 
  • అవసరం అయితే దాంట్లో నిమ్మరసం కూడా కలపొచ్చు.
  • బట్టలు ఉతకడానికి వాడే బేకింగ్ సోడాతో రుద్దినా ఫలితం ఉంటుంది. 
  • వేడి చేసిన నీళ్లలో బేకింగ్ సోడా కలిపి... పెనంలో వేసి రుద్దాలి. 
  • అవసరమైతే ఇంకా బేకింగ్ సోడా కూడా కలుపుకోవచ్చు.
  • టొమాటో కెచప్ తో మాడిన పెనాన్నిక్లీన్ చేయొచ్చని తెలుసా? 
  • మాడిన దగ్గర టొమాటో కెచప్ పూసి, అరగంట సేపు ఉంచాలి. 
  • తర్వాత రుద్ది నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. 

ALSO READ : Crickek World Cup 2023: మా పరువు తీస్తున్నారు..నన్ను పాకిస్థానీ అని పిలవొద్దు: వకార్ యూనిస్