డెంగ్యూ జ్వరం సోకితే తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం సోకిన వారిలో నీటిశాతం తగ్గిపోయి ఎక్కువ నీరసించిపోతారు. జ్వరం సోకిన వారు ఎక్కువగా పళ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. కానీ దానిబారిన పడి ఆసుపత్రికి పరుగెత్తకుండా ఇంట్లోనే తగు జాగ్రత్తలు తీసుకుంటే అది మీ జోలికి రాదని ఆయుర్వేద వైద్య నిపుణులంటున్నారు.
ఒక గ్లాసు నీళ్లు ఒకటి రెండు స్పూన్ల మెంతులు, ఒక స్పూను తేనె, ఈ రెండింటినీ నీటిలో మరగించాలి. తరువాత ఆ నీటి వడబోసి తాగాలి. ఒక గ్లాసు పాలలో ఒక స్పూను పసుపు ఒక స్పూను తేనె వేసి, పాలను మరిగించి తీసుకోవాలి. ఒక గ్లాసు నీళ్లలో ఓ ఇరవై తులసి ఆకులు కొద్దిగా మిరియాల పొడి ఒకటి, రెండు స్పూన్ల తేనె వేసి.
Also Read :- ఒక్క జామ పండు తింటే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా
నీటిని మరగించి వేడిగా సిప్ చేయాలి. ఈ మూడింటిని క్రమం తప్పకుండా లేదా అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉంటే డెంగ్యూ ఫీవరికి దూరంగా ఉండొచ్చట. అలాగే జ్వరం కారణంగా ప్లేట్లెట్స్ పడిపోతే కొన్ని రోజులు బీట్ రూట్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకుంటే ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుందట.
== V6 వెలుగు లైఫ్