హుజురాబాద్లో ఉప ఎన్నికలో భాగంగా మాజీమంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున నామినేషన్ వేశారు. ఈటల రాజేందర్ పోటీచేసిన ప్రతిసారీ ముందస్తుగా తాను నామినేషన్ వేస్తానని ఆమె తెలిపారు. సెంటిమెంట్ కాదు కానీ.. నామినేషన్లో కొన్నిసార్లు పొరపాట్లు జరిగితే సేఫ్టీగా ఉంటుందని నామినేషన్ వేస్తానని ఆమె చెప్పారు. ఈటల రాజేందర్ నామినేషన్ తర్వాత తన నామినేషన్ ఉపసంహరించుకుంటానని ఆమె తెలిపారు.
For More News..