పీకే లాంటి వాళ్ళు ఎందరొచ్చినా టీఆర్ఎస్ ను కాపాడలేరు

ఒకప్పుడు కేసీఆర్ మాటలకు  చప్పట్లు కొడితే.. ఇప్పుడు ఛీ కొడుతున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.  ‘ రాష్ట్రంలో ఎక్కడ టెంట్ ఉంటదో అక్కడ నేను ఉంటాను. అణచివేత, ఆకలితో ఉన్న జనం పక్షాన నేను ఉంటాను. నేను కేవలం హుజురాబాద్ కే పరిమితమయ్యే వ్యక్తిని కాదు. మంత్రిగా ఉన్నప్పుడే కార్మికుల కోసం కొట్లాడిన.  V6, వెలుగు వల్లే నేడు ప్రజల సమస్యలు బయటకు వస్తున్నాయి, అంతా కేసీఆర్ కి  అమ్ముడుపోయారు. అడవిని నమ్ముకొని జీవిస్తున్న అమాయక బిడ్డల కడుపు కొట్టొద్దు. పీకే లాంటి వాళ్ళు ఎందరు వచ్చిన టీఆర్ఎస్ ను కాపాడలేరు. హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్షల ఎకరాల భూములు మాయం చేశారు. ధరణి గ్రామాల్లోని ప్రజల కుటుంబాల్లో మట్టి పోసింది. సమయం వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు కర్రుకాల్చి వాత పెడుతారు. కేసీఆర్ డబ్బులు, మద్యం, కుట్రలు, పోలీసులను నమ్ముకున్నారు.  ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఒడిపోయేది కేసీఆర్ . టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎంపీలు కేసీఆర్ బొమ్మతో వెళ్తే ఓడిపోవడం ఖాయం.  టీడీపీ తరహాలోనే కాంగ్రెస్ ను కూడా కేసీఆర్ మింగేస్తాడు. నశం లెక్క బీజేపీని పీల్చడం నీతరం కాదు కేసీఆర్. ఎన్ని  ఇబ్బందులు పెట్టిన బీజేపీ బెదరదు’ అని ఈటల అన్నారు.

మోటార్లకు మీటర్లు పెడితే కేసీఆర్ కు మీటర్ పెడ్తం

 

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే