సాధారణంగా అన్నం తినేటప్పుడు చేతులు కడుక్కుంటాం. ఆఫీసుల్లో లంచ్ చేసేటప్పుడు.. ప్లేట్లను కూడా సబ్బుతో కడుక్కుంటాం. ఆ తరువాత వాటిని పక్కన పడేస్తాం. క్లీనింగ్ స్టాఫ్ వచ్చి క్లీన్ చేస్తారు. ఇది రొటీన్... అదే ఇంట్లో అయితే చాలామంది. ... తినే ముందు వాష్ బేసిస్ దగ్గరకో.. ట్యాప్ దగ్గరకో వెళ్లి కడుక్కుంటాం.. తిన్న తరువాత ... అదే కంచంలో కడిగేసుకొని పక్కనే ఉన్న టవల్ కో లేదా ఒంటికి ఉన్న చొక్కాకో తుడిచేసుకుంటాం. కాని జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా చేయడం వలన చాలా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. తిన్న తరువాత చేతులను శుభ్రం చేసుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయట.. ఇమనం ఆహారాన్ని తినే సమయంలో ఉన్న కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం..
సనాతన హిందూ ధర్మంలో ఆహారానికి సంబంధించి అనేక నియమాలను పేర్కొన్నారు. ఆహారం, ధాన్యాన్ని దేవతా స్వరూపంగా భావిస్తారు. అందుకనే తినే ఆహారం, ఆహారం తినే సమయం, కూర్చునే దిశ ఇలా అన్నింటికీ నియమాలు పెట్టారు. అయితే ఎక్కువ మంది తాము ఆహారం తిన్న తర్వాత.. అదే ప్లేట్ లో చేతులు కడుక్కుంటారు. అయితే ఇలా ఆహారం తిన్న ప్లేట్‌లో చేతులు కడుక్కోవడం అశుభం. ఇలా చేయడం వలన అన్నపూర్ణ దేవికి కోపం వచ్చి మొత్తం కుటుంబంపై చెడు ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అన్నపూర్ణ దేవికి ఆగ్రహం కలిగితే ఆ ప్రభావం వ్యక్తి పై మాత్రమే కాదు ఆ కుటుంబంపై కూడా పడుతుంది. పేదరిక బారిన పడతారని శాస్త్రాల్లో చెప్పారు.
ఆహారం తినే ప్లేట్ లో పెట్టుకునే ఆహారం..
ఆహారం తినే సమయంలో మొట్ట మొదటిగా గుర్తుంచుకోవాల్సింది.. ఎంత తినగలరో అంతే ఆహారాన్ని ప్లేట్ లో పెట్టుకోవాలి. అంతేకాదు తినే ఆహారాన్ని ఎక్కువ పెట్టుకుని వృధా చేయడం వలన అన్నపూర్ణాదేవికి ఆగ్రహం కలుగుతుంది. అంతే కాదు.. తినే సమయంలో ఎక్కువగా ఆహారం పెట్టుకోవడం వలన చూసే వారికి కూడా ఇబ్బంది కరంగా మారుతుంది.
పురాణాల ప్రకారం ఆహారాన్ని అగౌరవపరచడం గొప్ప పాపంగా పరిగణించబడుతుంది. ఆహారాన్ని వృధా కాకుండా ఉండే విధంగా ప్లేట్‌లో ఆహారాన్ని పెట్టుకోవాలి. ప్లేట్‌లో ఆహారాన్ని వదలకూడదు. పళ్లెంలో భోజనం వదిలి పెట్టడం వలన అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. ప్లేట్‌లో తింటూ తింటూ ఆహారం వదిలివేయడం చెడు అలవాటుగా మారుతుంది. ఇలా మళ్లీ మళ్లీ చేస్తారు.. తినే ఆహారం వృధా పడవేయడం లక్ష్మీదేవిని ఆగ్రహం కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో వింత సమస్యలు తలెత్తుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
తినే కంచంలో చేతులు కడుక్కోవడం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆహారం తిన్న తర్వాత అదే ప్లేట్ లో చేతులు కడుక్కోవడం వల్ల సంపదకు దేవత అయిన లక్ష్మి దేవి, ఆహార అధిదేవత అన్నపూర్ణ దేవికి కోపం తెప్పిస్తుంది. తిన్న తర్వాత ఎప్పుడూ తిన్న ప్లేట్ లో చేతులు కడగకూడదని అంటారు. ఆహారంలోని ప్రతి మెతుకుని గౌరవించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా..! అలాంటి పవిత్రమైన పదార్దంలో చేతులు కడగవద్దని పండితులు సూచిస్తున్నారు.