Health Tips: ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల లాభమా?నష్టమా?

Health Tips: ఖాళీ కడుపుతో పండ్లు తినడం వల్ల లాభమా?నష్టమా?

పండ్లు తినడం మంచి అలవాటు. చాలా తక్కువ మందికి ఈ అలవాటు ఉంటుంది. పండ్లు తినడం వల్ల సహజ శక్తిని అందించడమే కాకుండాఇది అనేక విటమిన్లు, ఖనిజాలు ,ఫైబర్‌ను కూడా అందుతాయి.  దీని కారణంగా చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో అల్పాహారంగా పండ్లు తింటారు. ఇక జిమ్‌కు వెళ్లేవారు ఖాళీ కడుపుతో అరటిపండ్లు తింటారు. అయితే ఉదయం మొదట పండ్లు తినడం సరియైనదేనా? అలా తింటే లాభమా? నష్టమా? తెలుసుకుందాం. 

ఖాళీ కడుపుతో పండ్లు తినడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతారు. అయితే  అది మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. పరిగడుపున పండ్లతో రోజును ప్రారంభించడం సరైన మార్గం కాదు అంటున్నారు. ప్రతికూలతలను ఎత్తి చూపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు శరీరంలో కఫ దోషం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరం చల్లగా, నెమ్మదిగా ,బరువుగా ఉంటుంది. దీని అర్థం మీ జీర్ణక్రియ బలహీనంగా ఉంటుంది.ఆ సమయంలో చల్లని పండ్లు తినడం హానికరం అంటున్నారు ఆరోగ్యనిపుణులు. 

ఇలా రోజు చేయడం వల్ల ఈ అలవాటు మీ జీవక్రియ, జీర్ణక్రియకు హానికరం చేయొచ్చు. కడుపు ఉబ్బరం, అసౌకర్యం ,మధ్యాహ్న శక్తి తగ్గి పోవడం వంటివి జరగొచ్చు. పండ్లు త్వరగా జీర్ణమవుతాయి .ఇది త్వరగా ఆకలికి దారితీస్తుంది.అల్పాహారంలో పండ్లు మాత్రమే తినడం వల్ల చక్కెర పెరుగుదల, శక్తి తగ్గడం, కోరికలు ,అలసట ఏర్పడతాయి. కాబట్టి అప్పుడు ఏమి తినాలో తెలుసుకుందాం.

ఉదయం తినడానికి ఉత్తమ ఆహారాలు

  • ఉడికించిన ఆపిల్స్ తో దాల్చిన చెక్క
  • నెయ్యితో స్పైస్డ్ ఓట్ మీల్
  • అల్లంతో బియ్యం గంజి
  • బాదంతో వెచ్చని పాలు

ఈ ఆహారాలన్నీ శరీరంలో అగ్నిని పెంచుతాయి.ఎక్కువ కాలం కడుపు నిండుగా,ఉల్లాసంగా ఉంచుతాయి. పండ్లు తినడానికి ఉత్తమ సమయం ఉదయం పది తర్వాత లేదా మధ్యాహ్నం అని డాక్టర్లు చెబుతున్నారు.