ఉల్లిగడ్డ మస్తు తింటున్నం.. ఒకప్పుడు ఏటా 2 కేజీలు తింటే.. ఇప్పుడు 14 కేజీలు

1961లో ఏటా తలసరి వాడకం 2.25 కేజీలు.. ఇప్పుడు 14.7 కేజీలు

60 ఏండ్లలో వ్యక్తిగత వినియోగం ఆరున్నర రెట్లు పెరుగుదల

ఎక్కువ తింటున్న దేశాల్లో మనది 34వ స్థానం

10 ఏండ్ల కిందటితో పోలిస్తే 12 స్థానాలు పైకి

ఫావోస్టాట్​ స్టడీలో వెల్లడి

న్యూఢిల్లీ: అన్నా.. ఉల్లిగడ్డలెయ్యరాదె… పానీపూరీ బండి దగ్గర ఓ కస్టమర్​ రిక్వెస్ట్​. ఎక్స్​ట్రా ఆనియన్​.. ఓ బిర్యానీ లవర్​ డిమాండ్​. ఇంట్ల ఉల్లిగడ్డ లేని వంట ఉంటదా! వెజ్​ అయినా.. నాన్​వెజ్​ అయినా.. ఇల్లైనా.. హోటల్​ అయినా.. ఉల్లికి మస్తు డిమాండ్​. అవును మరి.. మనోళ్లకు అదంటే అంతిష్టం. అందుకేనేమో మన దేశంలో ఉల్లి తినడం ఎక్కువైంది. ఫావోస్టాట్​ అనే సంస్థ పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. 150 దేశాల్లో ఉల్లి వాడకంపై స్టడీ చేసి రిపోర్ట్​ ఇచ్చింది. ఈ లిస్టులో ఉల్లిగడ్డ వాడకం ఎక్కువున్న దేశాల్లో మనది 34వ ర్యాంకు. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే మన దేశం 12 స్థానాలపైకి ఎగబాకింది.

2016 కన్నా 8 శాతం ఎక్కువ

దేశంలో 1961లో ఏడాదికి సగటున ఒక్కో మనిషి 2.25 కిలోల ఉల్లిగడ్డను తింటే 2017 నాటికి అది 14.7 కిలోలకు పెరిగింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.92 శాతం ఎక్కువ అది. దాదాపు అరవై ఏళ్లలో వినియోగం ఆరున్నర రెట్లు పెరిగింది. మన పొరుగు దేశాలైన పాకిస్థాన్​, చైనా, బంగ్లాదేశ్​ల కన్నా ఇండియాలోనే ఉల్లి వాడకం ఎక్కువగా ఉంది. పాక్​లో సగటు వినియోగం 8.43 కిలోలు కాగా, బంగ్లాదేశ్​లో 12.3 కిలోలు, చైనాలో 14.6  కిలోలు, శ్రీలంకలో 16.8 కిలోలుగా ఉంది.

ఉల్లి ఎక్స్​పోర్ట్స్​కు పెద్దన్న

ఉల్లి ఎగుమతుల్లో ప్రపంచానికి పెద్దన్నల్లో ఒకటి మన దేశం. వివిధ దేశాలకు ఆనియన్స్​ను పంపిస్తున్న దేశాల జాబితాలో నెదర్లాండ్స్​ ఫస్ట్​ ప్లేస్​లో ఉంటే.. మన దేశం మూడో ప్లేస్​లో ఉంది. అంతేకాదు.. ప్రొడక్షన్​లో ప్రపంచంలోనే రెండో స్థానం మనది. ఏటా సగటున కోటీ 92 లక్షల 99 వేల టన్నుల ఉల్లిగడ్డలను మన రైతులు పండిస్తుంటారు.  మన దగ్గరి నుంచి ఎక్కువగా శ్రీలంక, యూఏఈతో పాటు బంగ్లాదశ్, నేపాల్, మలేసియా వంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ మధ్య మన దగ్గర రేట్లు భారీగా పెరుగుతుండడంతో విదేశీ ఎగుమతులను కేంద్రం బ్యాన్​ చేసింది. బుధవారమే ఆ బ్యాన్​ను ఎత్తేసింది.

ఇప్పుడు మస్తు రేటు

ప్రస్తుతం మార్కెట్​లో ఉల్లిగడ్డ రేట్లు దారుణంగా ఉన్నాయి. కిలో వందకుపైనే పలుకుతోంది. పంట ఎక్కువగా పండే మహారాష్ట్ర, ఏపీల్లో వర్షాలు ఎక్కువగా కురవడం, చాలాచోట్ల పంట నష్టపోవడంతో పాటు డిమాండ్​ కూడా పెరగడంతో రేట్లు పెరిగాయంటున్నారు నిపుణులు. రేట్లను తగ్గించేందుకు కేంద్రం బఫర్​స్టాక్​లోని ఉల్లిగడ్డలను మండీలకు పంపిస్తామని చెప్పింది. ఖరీఫ్​ సీజన్​లో సుమారు 37 లక్షల టన్నుల ఆనియన్స్​ పండించారని, అవి కూడా మార్కెట్​కు వస్తే రేట్లు తగ్గుతాయని చెబుతున్నారు. మరోవైపు రేట్లను కంట్రోల్​ చేసేందుకు రిటైల్​, హోల్​సేల్​ వ్యాపారులకు స్టాక్​పై లిమిట్​ పెట్టింది. రిటైల్​ వ్యాపారులు 2 టన్నులు, హోల్​సేల్​ వ్యాపారులు 25 టన్నులకు మించి స్టాక్​ పెట్టుకోకూడదని పేర్కొంది.

For More News…

సర్కార్ ఉద్యోగులకు డీఏ

మక్కలు మళ్లీ కొనేది లేదు.. ఇదే చివరిసారి..