ఇంట్లో వండే వంటలు, తీసుకునే తిండిలో కొద్దిగా మార్పులు చేసుకోవాలని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ చెబుతోంది. రోజూ తినే భోజనం ఇలా ఉండాలని దక్షిణ భారత దేశ ప్రజల కోసం ఓ హెల్డీ డే మీల్స్ ప్లాన్ని రూపొందించింది. రోజులో తీసుకునే ఆహరంలో ఏవేవి ఎంతెంత ఉంటే ఆరోగ్యంగా ఉంటామో చెబుతోంది. రోజూ తీసుకునే ఆహారంలో సగం (50 శాతం) ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండాలి. 35 శాతం అన్నం, గోధుమ, తృణ ధాన్యాలు ఉండాలి.. మిగిలిన 15 శాతం మాంసం, నూనెలు, ప్రొటీన్ ఫుడ్స్ ఉండాలి.
బెస్ట్ మీల్స్
తృణ ధాన్యాలతో అనారోగ్య సమస్యలు రికార్డు కాలేదు. బియ్యం కంటే మిల్లెట్స్ ధాన్యాలు మంచిది. రైసిని ఎక్కువగా పాలిష్ చేయడం వల్ల ఉన్న ఐరన్, బీ కాంప్లెక్స్ (బీ–1, బీ–2) విటమిన్లు, క్యాల్షియం, పీచు పదార్థం పోతున్నాయి. ఉత్త పిండినే తింటున్నారు. బ్రౌన్ రైస్ కంటే మిల్లెట్స్ తీసుకుంటే బెటర్. రెంటిలోనూ కార్బొహైడ్రేట్స్ సమంగానే ఉంటాయి. కానీ మిల్లెట్స్లో ఫైబర్ ఎక్కువ . 300 గ్రాముల రైస్ తీసుకునే వాళ్లు దానికి సమానంగా 300 గ్రాముల తృణ ధాన్యాలు తీసుకోకూడదు. క్వాంటిటీ ఎంత తీసుకోవాలన్న దానికి క్యాలరీలే ప్రామాణికం. సాధారణ శ్రమచేసే (ఇంటి పని, ఆపీసు పని) సెడెంటరీ వర్కర్స్క రోజుకు 2000 కిలో క్యాలరీల శక్తి అవసరం. దీనికి తగినట్లుగా ఆహారం తీసుకోవాలి.