అవునా:టెన్షన్ గా ఉన్నప్పుడు సమోసా, బర్గర్ తినకూడదా..?

అవునా:టెన్షన్ గా ఉన్నప్పుడు సమోసా, బర్గర్ తినకూడదా..?

మనం ఏదైనా షాపింగ్ కు గానీ, బజారుకు వెళ్లినపుడు గానీ..ఏదైనా హోటల్ కు వెళ్లినప్పుడు గానీ సమోసాలు, బర్గర్లు తింటుంటాం.. ముఖ్యంగా స్ట్రెస్ కు గురైనపుడు ఓ రెండు సమోసాలు తిని చాయ్ తాగితే  రిలాక్స్ గా ఉంటుందని భావిస్తాం.తింటాం కూడా.. బేకరీలకు వెళ్లినపుడు  బర్గర్లు తింటుంటాం. అయితే బర్గర్లు, సమోసాలు ఒత్తిడిలో ఉన్నపుడు తింటే దుష్పలితాలు ఉంటాయని  ఇటీవల జరిపిన కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి..ఈ బర్గర్లు,సమోసాలు అన్ని సందర్భాల్లో తినకూ డదా..? తింటే ఏమవుతుంది..? .. పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం రండి.. 

ఒత్తిడికి గురైనప్పుడు సమోసా లేదా బర్గర్ వంటి జంక్ ఫుడ్ తినడం వల్ల ఆందోళన స్థాయిలు పెరుగుతాయని పరిశోధకులు  అంటున్నారు. ఒత్తిడిలో ఉన్నపుడు ప్రజలు రిలాక్స్ కోసం అధిక కేలరీల ఆహారం వైపు మొగ్గు చూపుతారు. 

బౌల్డర్ లోని కొలరాడో యూనివర్సిటీలో పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం.. అధిక కొవ్వు ఆహారం తీసుకుంటే.. ప్రేగుల్లో బ్యాక్టీరియాకు అంతరాయం కలిగిస్తుందట..మన మూడ్ లో మార్పులు చేస్తుందట.. మెదడులోని రసాయనాలను ప్రభావితం చేసి ఆందోళన పెంచే అవకాశం ఉందట.

అధిక కొవ్వు గల ఆహారం మెదడులోని జన్యవులను మార్చగలదని కొలరాడో యూనివర్సిటీ ఫ్రొఫెసర్ క్రిస్టోఫర్ లోరీ  చెప్పారు. అధిక కొవ్వు తప్పనిసరిగా వారి మెదడులో అధిక ఆందోళన స్థితికి కారణం అవుతుందని లోరి బయోలాజికల్ రీసెర్చ్ జర్నల్ లో రాశారు. అధిక కొవ్వు ఆహారం  న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్ ఉత్పత్తి , సిగ్నలింగ్‌లో పాల్గొన్న మూడు జన్యువుల్లో మార్పుతో ఒత్తిడి , ఆందోళన ముడిపడి ఉంటుందన్నారు. 

అయితే అన్ని కొవ్వులు చెడ్డవి కావు , చేపలు, ఆలివ్ నూనె, గింజలు , గింజలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు మెదడుకు ఒత్తిడిని తగ్గిస్తాయని అని పరిశోధకులు అంటున్నారు.