Good Health: గట్ హెల్త్ మన చేతుల్లోనే.. ఇలా తింటే ఇంప్రూవ్ అవుతుంది..!

Good Health:  గట్ హెల్త్ మన చేతుల్లోనే.. ఇలా తింటే ఇంప్రూవ్ అవుతుంది..!

గట్ హెల్త్ గురించి వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయ్యింది ఈ టర్మ్. మనిషిలో వచ్చే ఏ జబ్బుకైనా కారణం గట్ హెల్తే అని డాక్టర్స్ చెప్తున్నారు. దీనిపై అవేర్నెస్ చేయడం కోసం డాక్టర్స్ చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. గట్ హెల్త్ బాగుంటే.. మన హెల్త్ బాగుంటుంది.. దాదాపు రోగాలు వచ్చే ఛాన్స్ తక్కువ అని చెబుతున్నారు. అయితే ఈ గట్ హెల్త్ ను ఇంప్రూవ్ చేసుకోవాలంటే డైట్, ఫూడ్, మెడిసిన్ తో పాటు మరో చిట్కా గురించి చెబుతున్నారు. తినే పద్ధతి మార్చుకుంటే స్లోగా గట్ హెల్త్ ను ఇంప్రూవ్ చేసుకోవచ్చునని చెబుతున్నారు డాక్టర్లు. అదెలాగో చూద్దాం. 

గట్ హెల్త్ అంటే మనిషి ఆహార ప్రక్రియలో పాల్గొనే ముఖ్యమైన ఆర్గాన్స్ కు సంబంధించిన హెల్త్. అంటే జీర్ణకుహరం, జీర్ణాశయం, పెద్దపేగు, చిన్నపేగు మొదలైన అన్నింటిని కలిపి గట్ అంటుంటారు. గట్ ను ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని వివిధ పరిశోధనలలో తేలింది. 

ఎలా తింటే గట్ హెల్త్ బాగుంటుంది:

ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్ లో స్పీడ్ స్పీడ్ గా తిని ఇంటినుంచి బయట పడుతుంటారు. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వచ్చాక ఎలా తింటున్నామో.. ఏం తింటున్నామో కూడా తెలియని స్థితిలో ఉన్నారు ఈ కాలపు జనాలు. అయితే గట్ హెల్త్ ఇంప్రూవ్ కావాలంటే తినటానికి కూడా  ఒక పద్ధతి అవసరమని అంటున్నారు వైద్యులు.  

గట్ హెల్త్ ఇంప్రూవ్ కావాలంటే స్లోగా.. మెల్లిగా తినాలని సూచిస్తున్నారు వైద్యులు. ఎందుకంటే మన ఆహారం డైజెషన్ (జీర్ణం) నోట్లోనే మొదలవుతుందట. మనం తినే విధానాన్ని ఎంజైమ్ ల విడుదల ఆధారపడి ఉంటుంది. వేగంగా తినటం వలన గట్ బ్యాక్టీరియా సరిగా పనిచేయదు. కార్బోహైడ్రేట్స్ ను కరిగించేందుకు విడుదలయ్యే ఎంజైమ్స్ లో కూడా అసమతుల్యత ఏర్పడుతుంది. 

వేగంగా తినడంవలన ఒకేసారి జీర్ణీశయంలోకి ఫుడ్ పడిపోతుంది. దీంతో గట్ బ్యాక్టీరియా జీర్ణం చేసేందుకు ఎక్కువ మొత్తంలో శ్రమించాల్సి వస్తుంది. దీని కారణంగా ఎక్కువ మొత్తంలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇది గ్యాస్ ట్రబుల్ కు దారి తీస్తుందని డాక్టర్లు అంటున్నారు. అందువలన ఎక్కువ సేపు నమిలి తినడంమంచిది. ఎంజైమ్స్ పని సక్రమంగా ఉండటం వలన న్యూట్రిషన్ ను గ్రహించడం తేలిక అవుతుందట. 

అంతేకాకుండా వేగంగా తినడం వలన గ్యాస్ తో పాటు యాసిడ్ పెరిగి.. హార్ట్ బర్న్ (గుండెలో మంట) సమస్య ఉత్పన్నం అవుతుందట. అంతే కాకుండా దీర్ఘ కాలిక గ్యాస్ట్రిక్ సమస్యగా కూడా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందువలన బాగా నమిలి తినడం వలన ఎంజైమ్స్ బాగా పనిచేస్తాయి. గట్ బ్యాక్టీరియా పనితీరు బాగుంటుంది. తిన్న ఆహార పదార్థాలు అరుగుదల, సోషణ (obsorpiton) బాగుంటుంది. బాగా అరగటం వలన విసర్జన అవయవాల పనితీరు కూడా బాగుంటుంది. ఇవన్నీ బాగుంటే గట్ హెల్త్ కూడా బాగుంటుంది. అంటే ఎంత నమిలి తింటే.. ఎంత స్లోగా తింటే గట్ హెల్త్ ను అంతగా ఇంప్రూవ్ చేసుకోవచ్చునట. 

వేగంగా తినడం వలన ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో ప్రయోగాత్మకంగా చూపించారు డాక్టర్లు. ఈ వీడియో చూస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది.