అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తింటే తీరొక్క వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ హెచ్చరించింది. తరచూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీనే వారికి క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 రకాల వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని రిసెర్చ్ చేసి చెప్పారు. దీని వల్ల మానసిక అనారోగ్యం, అకాల మరణ ముప్పు కూడా పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. కోటి మంది నుంచి వివరాలు సేకరించి రిసెర్చ్ చేశామని శాస్త్రవేత్తలు తెలిపారు.
గుండె సంబంధిత వ్యాధుల వల్ల కలిగే మరణ ముప్పు 50 శాతం పెరుగుతుందని రిసెర్చ్ లో తేలిందని సైంటిస్టులు చెప్పారు. పరిశ్రమల్లో తయారయ్యే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో విటమిన్లు తక్కువగా ఉంటాయని చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనంలో తెలిసిందన్నారు.
ప్రజారోగ్య కోసం ప్రభుత్వాలు అత్యవసరంగా తగిన చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు. స్కూళ్లు, దవాఖానల దగ్గర అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రచారం, అమ్మకాలు నిషేధించ సూచించారు. ఈ మొత్తం రిసెర్చ్ లో ఆస్ట్రేలియా, యూఎస్, ఫ్రాన్స్, ఐర్లాండ్ శాస్త్రవేత్తలు చాలా మంది పాల్గొన్నారు.