హుజూరాబాద్ బరిలో నేనున్నా.. రాజేందర్ ఉన్నా ఒక్కటే

హుజూరాబాద్ బై పోల్ ప్రచారంలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు... మాజీ మంత్రి , బీజేపీ నేత ఈటల రాజేందర్ సతీమణి జమున.  హుజూరాబాద్ పోటీలో తానున్నా... రాజేందర్ ఉన్నా ఒక్కటే అన్నారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు జమున. రాష్ట్రంలో  దౌర్భాగ్య  ప్రభుత్వం ఉందని విమర్శించారు. కరీంనగర్ జిల్లా  హుజురాబాద్ కాకతీయ  కాలనీలో ఇంటింటి  ప్రచారంలో జమున పాల్గొన్నారు. ఓ మహిళ  స్వేచ్ఛగా ప్రచారం చేసుకోలేని  పరిస్థితి ఉందన్నారు.  ఈటల  లాంటి  వ్యక్తిని ... మోసంతో పార్టీ  నుంచి బయటకు వెల్లగొట్టారని ఆరోపించారు. కుట్రలు , కుతంత్రాలతో అబద్ధపు ప్రచారాలు  చేస్తున్నారని మండిపడ్డారు జమున .