ఈబీసీల కోసం రాజీవ్ యువ వికాసం గడువు పొడిగించండి : వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి

ఈబీసీల కోసం రాజీవ్ యువ వికాసం గడువు పొడిగించండి : వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి
  • డిప్యూటీ సీఎంకు ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి వినతి

హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు అప్లై చేసుకునే గడువును ఈ నెల 30  వరకు పొడిగించాలని ఈబీసీ సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి కోరారు. సోమవారం ఈ అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆయన లేఖ రాశారు. ఈ స్కీమ్​కోసం అప్లికేషన్ స్టార్ట్ అయిన వారం తరువాత ఈబీసీలకు అవకాశం ఇచ్చారని, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం అప్లై చేస్తే రాలేదని, దీంతో చాలా మంది అప్లై చేసుకోలేదని లేఖలో పేర్కొన్నారు.  ఈ స్కీమ్ లో ఈబీసీలకు అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈబీసీల్లో ఎంతో మంది పేదలు ఉన్నారని, వాళ్లు కూడా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఇవ్వాలని రవీందర్ రెడ్డి కోరారు.