నల్గొండ జిల్లా ఓటరు జాబితాను ప్రకటించిన ఈసీ

నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా తుది ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్​ బుధవారం ప్రకటించింది.  12 నియోజకవర్గాల్లో  28,30,528 మంది ఓటర్లు ఉండగా.. మునుగోడు అత్యధికంగా 2,48,524, అత్యల్పంగా భువనగిరిలో 2,11,416 మంది ఓటర్లు నమోదయ్యారు.  నల్గొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం ఓటర్లు 14,26,480 మంది ఉండగా పురుషులు 7,08,924 మంది, మహిళలు 7,1 7,436, థర్డ్​ జెండర్ 120 మంది నమోదయ్యారు.  

యాదాద్రి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో  మొత్తం ఓటర్లు 4,39,100 కాగా.. పురుషులు-2,19,792, మహిళలు-2,19,290 మంది , థర్డ్​ జెండర్లు 18 మంది ఉన్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలోకి వచ్చే నాలుగు నియోజకవర్గాల్లో  9,64,346 మంది ఓటర్లు ఉండగా .. పురుషులు 4,75,915 మంది , మహిళలు4, 4,88,374 , థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 57 మంది ఉన్నారు.