ఈసీకి ఆ హక్కు లేదు: ఏపీ సర్కారు

ఎన్నికల సంఘం ఏపీ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌ ను బదిలీ చేయడాన్ని సవాల్‌‌‌‌‌‌‌‌ చేస్తూచంద్రబాబు సర్కారు బుధవారం హైకోర్టును ఆశ్రయించిం ది. ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌ ను మార్చేహక్కు ఈసీకి లేదని పిటిషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఇదే అంశంపై ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాసింది. మరోవైపు ఈసీ ఆదేశాలతో ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ అధినేత వెంకటేశ్వరరావుతోపాటు కడప, శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు రాహుల్‌‌‌‌‌‌‌‌దేవ్‌ శర్మ, వెంకటరత్నంలను రిలీవ్‌ చేస్తూ మంగళవారం రాత్రి జీవో 716 విడుదల చేసిన ప్రభుత్వం ..తెల్లారే సరికే మెలిక పెట్టింది. ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌ ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌ పరిధిలోకి రారని పేర్కొంటూ 716 జీవోను రద్దు చేస్తూ బుధవారం మరో జీవో ను(720) జారీ చేసింది. ఈ జీవోలో వెంకటేశ్వరరావు పేరును తప్పించిం ది. కేవలం కడప,శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలను మాత్రమే రిలీవ్‌ చేస్తున్నట్టు అందులో పేర్కొంది. అలాగే ఈసీ పరిధిలోకి ఎవరెవరు వస్తారో వివరిస్తూ ఇంకో జీవో(721)ను కూడా తీసుకొచ్చింది. అందులో డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని ఈసీ పరిధిలోకి తెస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం పేర్కొం ది. ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌, కౌంటర్‌‌‌‌‌‌‌‌  ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ విభాగాలపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.