న్యూఢిల్లీ: గత కొంతకాలంగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్.. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బహిరంగంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని ఆరోపణలు చేసింది. హర్యానాలో కచ్చితంగా గెలుస్తామనుకుంటే.. ఫలితాల మాత్రం వ్యతిరేకంగా రావడంతో కాంగ్రెస్ ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై సందేహాలు లేవనెత్తింది. హర్యానాలో చాలా నిజయోకవర్గా్ల్లో ఓటర్లు.. నమోదైన ఓటింగ్ పర్సంటేజ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ఆరోపించింది.
శుక్రవారం (నవంబర్ 29) జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్‌లోనూ ఈవీఎంల పని తీరు, ఈసీ గురించి చర్చించి.. దీనిపై దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో ఈవీఎంలు, ఈసీపై కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలపై తాజాగా ఎన్నికల స్పందించింది. ఈ మేరకు శనివారం (నవంబర్ 30) కాంగ్రెస్‌కు ఈసీ ఒక లేఖ రాసింది. ఈవీఎంలు, ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్‌కు ఉన్న అనుమానాలు నివృత్తి చేస్తామని.. ఇందుకోసం 2024, డిసెంబర్ 3వ తేదీన రావాలని ఈసీ ఆహ్వానించింది.
కాంగ్రెస్‌కు ఉన్న అన్ని చట్టబద్ధమైన ఆందోళనలను సమీక్షిస్తామని తెలిపింది. ఓటర్ల సంఖ్య, ఓటింగ్ పర్సంటేజ్‌కు సంబంధించి కాంగ్రెస్ లేవనెత్తిన సమస్యపైన ఈసీ క్లారిటీ ఇచ్చింది. పోలింగ్ స్టేషన్ల వారీగా అభ్యర్థులందరికీ అందుబాటులో ఉన్న ఓటర్ టర్న్ అవుట్ డేటాలో ఎలాంటి వ్యత్యాసం లేదని స్పష్టం చేసింది. ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ పర్సంటేజ్ అప్డేట్ చేయడానికి ముందు ఇతర పనుల్లో బిజీ ఉంటారని.. ఈ కారణంగానే 5 పీఎం పోలింగ్ డేటా, తుది ఓటింగ్ శాతంలో తేడా ఉంటుందని ఈసీ క్లారిటీ ఇచ్చింది.
పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రి11.45కు ఈసీ వెబ్ సైట్లో పూర్తి వివరాలు అప్డేట్ చేస్తామని తెలిపింది. ఓటింగ్ ప్రక్రియ యొక్క ప్రతి దశలోనూ అభ్యర్థులు, వారి ఏజెంట్ల ప్రమేయంతో పారదర్శక ప్రక్రియను అనుసరిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. రాజకీయ పార్టీల ప్రమేయంతో పారదర్శకంగా ఓటర్ల జాబితా అప్డేట్ ప్రక్రియ ఉంటుందని ఎన్నికల సంఘం పునరుద్ఘాటించింది.