రైతు భరోసాపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాతే పంట పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని ఆదేశించింది. మొత్తం 69 లక్షల మంది లబ్ధిదారులకు గాను 65 లక్షల మందికి ఇది వరకే పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఇది వరకే అందజేసింది. ఈ నెల 8వ తేదీ లోపు అందరికీ రైతు భరోసా వేస్తామని ఈ నెల 4న కొత్తగూడెంలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 8వ తేదీలోపు రైతు భరోసా కంప్లీట్ చేస్తామని, లేకుంటే ముక్కు నేలకు రాస్తానని అన్నారు.
లేకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న ఎన్ వేణుకుమార్ అనే వ్యక్తి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ .. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంది. ఈ నెల 13న పోలింగ్ ముగిసే వరకు రైతుభరోసా కింద కర్షకుల ఖాతాల్లో డబ్బులు వేయొద్దని ఆదేశించింది.