ఏపీలో అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ వేడి రెట్టింపవుతోంది. పలు సంక్షేమ పథకాలకు నిధులు మంజూరు చేయకుండా ప్రభుత్వంపై ఈసీ ఆంక్షలు విధించటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా నిధుల విడుదల ఇవాళ ఒక్కరోజు సమయం ఇచ్చింది. కానీ, తన పరిధిలో ఉన్న ప్రభుత్వ అధికారులకు ఈసీ నిధులు విడుదల చేసేందుకు అనుమతులు ఇవ్వలేదు.
నిధుల విడుదలపై వివరణ కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది ఈసీ. ఈరోజే నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది ఈసీ. బటన్ నొక్కి ఇన్నాళ్లవుతున్నా ఎందుకు నిధులు విడుదల చేయలేదు, ఇంతకాలం లేని నిధులు ఇప్పుడు సడన్ గా ఎలా వచ్చిందంటూ ప్రశ్నించింది ఈసీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలని కోరింది ఈసీ.